ఎదురు చూపు
రచన: ఆదిమూలం వెంకట కృష్ణ మూర్తి మనసూ … ప్రాణం … నీ వైపు కొట్టుకొచ్చాక మిగిలి పోయిన యీ మట్టిలో … ఏ విత్తనం నాటమంటావు ? సముద్రం గుండె లోతుల్లోకి జారిపోయిన ఓ కన్నీటి బొట్టు జాడ కోసం, ఏ వలను విసరమంటావు. ఒక్క చినుకు కోసం ఆకాశాన్నే చూస్తూ, నోరు తెరచిన బీడులా ఎలా ఉండి పొమ్మంటావు. రాత్రి రాలిన మంచు బిందువు ఆవిరయ్యే వరకు ఎదురు చూసే కళ్ళకు ఏ సమాధానం […]